బత్తలపల్లి మండల కేంద్రంలొ ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పాలన, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, బాదుడే బాదుడు గురించి మాట్లాడుతూ వైసిపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళు న్నామని, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల 'శ్రీరామ్ ని ఎమ్మెల్యే గా గెలిపించుకొని, చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిని చేయడానికి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడతామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు మోహన్, మందలు తెలుగు ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ రంగ నాయుడు, మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు మందల రాము, మండల టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మారుతి గౌడ్, బత్తలపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు మండల సదాశివ నాగార్జున రెడ్డి, ముస్టూరు సాంబ, చంద్రశేఖర్ గౌడ్ మాల్యవంతం బాబు, అప్పస్వామి మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.