బనగానపల్లె పట్టణానికి చెందిన గిరిజన భార్యను కిడ్నాప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప అన్నారు. ఈ సందర్భంగా గురువారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట గల మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బనగానపల్లె లో గిరిజన బాలికను కిడ్నాప్ చేసి ఇ పది రోజులు కావస్తున్నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ విషయంలో ఎస్టీ కమిషన్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.