గడివేముల మండల పరిధిలోని ఎరువులదుకాణాలలో నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు రైతులకు అంటగట్టి మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి హేమ సుందర్రెడ్డి హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో మండలం లోని ఫర్టిలైజర్ దుకాణదారులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు.
సూచించిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని, బిల్లులు ఖచ్చితంగా ఇవ్వా లన్నారు. ప్రతి రైతుకు 50 బస్తాల ఎరువులు మాత్రమే ఇచ్చి ఈ-పాస్ యంత్రంలో నమోదు చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మే వారిపై తమకు సమా చారం అందించాలని కోరారు. ఏఈఓలు మహేష్ సాయి, డీలు పాల్గొన్నారు.