నంద్యాల బండి ఆత్మకూరు మండలంలోని పక్కా గృహాల లబ్ధిదారులు నిర్మాణాలను వెంటనే పూర్తి చేసుకోవాలని హౌసింగ్ డిఈ కే. ఉమామహేశ్వరరావు, ఏఈ సుంకి రెడ్డి తెలిపారు. కుడా ఫేస్ 2 కింద మండలానికి 1438 గృహాలు మంజూరు అయ్యాయని, జగనన్న కాలనీలలో 481 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. జగనన్న లే ఔట్లలో ఇంకా గృహ నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. సొంత స్థలాల లబ్ధిదారులకు 957 గృహాలు మంజూరు అయ్యాయని తెలిపారు.