మహానంది మండలం లో ఉపాధి కూలీ మహాబూబ్ బాషా పని ప్రదేశంలో పాము కాటుకు గురైన ఘటన చోటు చేసుకుంది. అబ్బీపురం గ్రామానికి చెందిన బాషా ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టుపల్లె - వెంగళరెడ్డిపేట దారిలో కాల్వ పనులు చేపడుతుండగా బాషా పాముకాటుకు గురయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, బాధితుడి కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa