నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. వైకాపా సోషల్ మీడియా డివిజన్ కోఆర్డినేటర్ కృష్ణా రెడ్డి తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్ళితే...పేస్ బుక్ లో ప్రేమ-పెళ్లి అంటూ యువతి వెంటపడ్డాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేసి ఫోటోలు తీసాడు. అవి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ మహిళను గర్భవతిని చేసాడు. పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అబార్షన్ చేయించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు, పెద్దలు కూర్చుని పెళ్ళిచేసారు. అది మనసులో పెట్టుకుని యువతిని చిత్రహింసలకు గురిచేస్తూ హత్యా యత్నం చేసాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో అరాచకాల పర్వం ఇది. వైసీపీ రౌడీల రాజ్యంలో మహిళల దీనావస్థ ఇది అంటూ ప్రజలు తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మహిళకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి.