ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామమందిరం నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 12:53 PM

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం నిర్మాణానికి ధర్మవరంకు చెందిన జింకా రామాంజినేయులు, మణిమాల దంపతులు రూ. 25 లక్షలు విరాళం అందజేసినట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు చారుకీర్తి తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం గోడ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చారుకీర్తితోపాటు జింకా రామాంజినేయులు వెళ్లారు. అక్కడ శ్రీరామ జన్మభూమి రామమందిర నిర్మాణ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాజ్ కు చెక్కును అందించారు. ఈ చెక్కును చారుకీర్తి కుమారుడు అక్షయ్ జైన్ చేతులమీదుగా కార్యదర్శి అందుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com