చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు జరుగుతుందని చైర్మన్ జె. శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమైన తీర్మానం చేయాల్సి ఉన్నందున ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. చీరాల లోని మున్సిపల్ స్కూళ్లను విద్యాశాఖ లో విలీనం చేయనున్నట్లు చైర్మన్ చెప్పారు. కౌన్సిలర్లు, అధికారులు తప్పక సమావేశానికి హాజరుకావాలని శ్రీనివాసరావు కోరారు.