బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో సోనుకుమార్ అనే పోలీస్ తన అత్తింటి వారిపై కాల్పులు జరిపాడు. తన భార్య అంచల్ కుమారిని కాపురానికి పంపించడం లేదని కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అంచల్ కుమారి తండ్రి గిర్‌ధర్ మృతిచెందాడు. ఆమె సోదరుడు కృష్ణకుమార్ కి గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత సోను పోలీసుల వద్ద లొంగిపోయాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతోనే అంచల్ కుమారి తన పుట్టింటికి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa