చికెన్ ను ఇంటికి తెచ్చి కడిగి తినడం వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు గుర్తించారు. ఇంటికి తెచ్చిన చికెన్ ను శుభ్రం చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. చికెన్ పై క్యాంపిలో బ్యాక్టర్ బ్యాక్టీరియా ఉండటంతో అది వంటడానికి కడిగే సమయంలో మనుషులపైకి వెళ్లి ఫుడ్ పాయిజనింగ్ చేసే ప్రమాదం ఉందని, కాబట్టి చికెన్ ను ఇంటికి తేగానే ఉడకబెట్టి వండితే సరిపోతుందని పరిశోధకులు తెలిపారు.