ఉల్లిపాయలు అందరికి తెలుసు. కూరల్లో వాడుతుంటాం. మరి ఈ ఉల్లికాడలేంటి అనుకుంటున్నారా? ఉల్లిపాయలు పూర్తిగా పెరగక ముందే మొక్కగా ఉన్న సమయంలో ఉల్లికాడలను సేకరిస్తారు. వీటిని మనం కూరల్లో వేసుకోవచ్చు. అయితే వీటిని చాలా మంది ఉపయోగించరు. కానీ వీటి వల్ల మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లికాడలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
-- ఉల్లికాడల్లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగు పరచడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి.
-- ఉల్లికాడలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
-- ఉల్లికాడలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది.
-- మధుమేహం ఉన్నవారికి ఉల్లికాడలు చేసే మేలు అంతా ఇంతా కాదు. షుగర్ పేషేంట్స్ వీటిని రోజూ తింటే షుగర్ అదుపులో ఉంటుంది.
-- ఉల్లికాడలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అజీర్తి సమస్యే ఉండదు.
-- ఉల్లి కాడల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక బాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.