--- సాధారణంగా పందులు బురదలో దొర్లుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అవి ఎందుకలా చేస్తాయో తెలుసా.. పందులు వాటి శరీరవేడిని తగ్గించుకునేందుకు బురదలో, నీటి కుంటల్లో దొర్లుతాయంట. ఎందుకంటే, చెమట గ్రంథులు వాటికుండవు మరి. ఒకవేళ వాటికి చెమట గ్రంథులు ఉండిఉంటే, మనలాగే వాటికీ కూడా చెమట పడుతుంది. శరీరవేడి తగ్గుతుంది.
--- దేశపౌరులకు, విదేశీ పర్యాటకులకు ఉచిత వైఫై ని కల్పించిన దేశం తైవాన్. ప్రపంచంలోనే ఈ వెసులుబాటు కల్పించిన తొలి దేశం తైవాన్.
--- ఉబర్ ఆటోలు, క్యాబ్ లు అందరికీ తెలిసే ఉంటుంది. ఉబర్ హెలికాఫ్టర్ గురించి ఎప్పుడైనా విన్నారా? దుబాయ్ లో ఉబర్ హెలికాఫ్టర్ ల సదుపాయం ఉంది. ఇందుకోసం ఉబర్ హెలికాఫ్టర్ లో ప్రయాణించాలనుకునే వారు పావుగంటకు 177డాలర్లను ఖర్చు చెయ్యాలి.