గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన కేంద్ర జల ఇంధన శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం అంచనాలను ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు.