కావలసిన పదార్ధాలు: పచ్చి మామిడికాయలు -2, జీరా పౌడర్ - 1 స్పూన్, పంచదార - 3 స్పూన్లు, పుదీనా ఆకులు - 4, బ్లాక్ సాల్ట్ - కొద్దిగా, ఐస్ క్యూబ్స్ .
తయారీవిధానం: పచ్చి మామిడికాయలను పైన చెక్కు తీసేసి, నీటితో బాగా కడగాలి. ఇప్పుడొక ప్రెజర్ కుక్కర్ తీసుకుని, కొన్ని నీళ్లు పోసి ఈ పచ్చి మామిడి కాయలను వెయ్యాలి. మూతపెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టాలి. ఆ తర్వాత మామిడికాయల నుండి గుజ్జును తీసి సెపరేట్ చెయ్యాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడకబెట్టిన పచ్చి మామిడికాయల గుజ్జును, పంచదారను, కొద్దిగా ఉప్పును, కొన్ని పుదీనా ఆకులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసి, మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయల మిశ్రమాన్ని ఒక రెండు స్పూన్లు వెయ్యాలి. ఆపై జీరా పౌడర్, బ్లాక్ సాల్ట్ కొద్దిగా, వేసి గ్లాసు నిండుగా నీళ్లను నింపాలి. గ్లాసు పైన కొద్దిగా జీరా పౌడర్ ను చల్లి, ఒక పుదీనా ఆకును పెట్టి సర్వ్ చేస్తే, రెస్టారెంట్ స్టైల్ వస్తుంది.