టొమాటోలను కూరల్లోనే కాదు, అందానికి కూడా ఉపయోగించొచ్చు. విటమిన్ ఏ, సి లు పుష్కలంగా ఉండే టొమాటోలతో ముఖానికి పూతను వెయ్యడం వల్ల మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నుండి ఉపశమనం పొందొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా మారి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
కావలసిన పదార్థాలు: టమాటో ప్యూరీ - 1 స్పూన్, శెనగపిండి - 1 స్పూన్, గంధం పొడి - 1 స్పూన్, పెరుగు లేదా పాలు - 1 స్పూన్
తయారీవిధానం: ఒక గిన్నెలో టమాటో ప్యూరీ, శెనగపిండి, గంధం పొడి, పెరుగు లేదా పాలు ఒక్కో స్పూన్ చొప్పున తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్నవారు పాలను, పొడి చర్మం ఉన్నవారు పెరుగును వాడితే మంచిది. అలానే ఈ ప్యాక్ లో శెనగపిండి ని మాత్రం అస్సలు మిస్ చెయ్యొద్దు. ఎందుకంటే, శెనగపిండి ముడతలు పడిన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకునేముందు, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. టమాటో పేస్ట్ రాసిన తర్వాత ముఖాన్ని బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రపరుచుకుంటే, తేడాని మిరే గమనిస్తారు.