మారుతున్న కాలానికి అనుగుణంగా మనలో చాలామందికి ఆరోగ్యం మీద శ్రద్ద చాలా ఎక్కువైంది. దీంతో మధ్య తరగతి, ఉన్నత వర్గం అనే తేడా లేకుండా అందరు పోషకాహారం పై బాగానే ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో గుమ్మడి గింజలను కూడా చాలామంది కొంటున్నారు. మరి గుమ్మడిగింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
-- గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిల్లో ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది.
-- ఈ విత్తనాల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
-- ఈ విత్తనాలను తినడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
-- గుమ్మడి గింజలతో రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది.
-- గుమ్మడికాయ విత్తనాలను రోజుకు గుప్పెడు మోతాదులోనే తినాలి. అంతకు మించితే జీర్ణ సమస్యలు వస్తాయి.