ఆంధ్రప్రదేశ్ లో ఆసుపత్రుల నిర్మాణానికి, గ్రామీణ స్థాయి నుంచి వైద్య కళాశాలల వరకు సౌకర్యాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.16,000 కోట్లు ఖర్చు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందాలంటే వైద్యులు, అధికారుల సహకారం అవసరమని మంత్రి రజనీ తెలిపారు. ఏపీఐఐసీ కార్యాలయం నుంచి వైద్యారోగ్యశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. తాను మంచినీటి ఎద్దడి, అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు, మరుగుదొడ్ల వినియోగం సరిగా లేకపోవడాన్ని గమనిస్తున్నట్లు తెలిపారు.నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలు పెద్దగా కనిపిస్తున్నాయన్నారు.