మహారాష్ట్ర రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగాయి. గురువారం,రాష్ట్రంలో 1,081 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి, కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,559కి పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,89,212 కాగా, మరణాల సంఖ్య 1,47,861కి చేరింది.రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కఠిన నిబంధనలు పాటించాలి అని, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించాలని కోరారు.