ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకూ సంక్షేమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 11:38 AM

గడప గడపకూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసాథి అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా కులం, మతం, రాజకీయాలకు అతీతంగా తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని లబ్దిదారులు సంతోషంగా చెబుతున్నారని పేర్కొన్నారు. దీనిని ఓర్చుకోలేని ప్రతిపక్ష నాయకులు అబద్దపు ప్రచా రాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉయ్యూరు మండలంలోని ముదునూరులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. గ్రామంలోని ప్రధాన కాలనీల్లో ఎమ్మెల్యే పార్థసారథి పర్యటించి, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. 


ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని తెలిపే కరప త్రాలను అందజేశారు. పలువురు స్థానికులు ప్రస్తా వించిన సమస్యలను నమోదు చేయించి పరిష్కరిం చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లా డుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్ని ప్రజల వద్దకు వచ్చి సంక్షేమంపై చర్చిస్తే వాస్తవాలు తెలుస్తాయ న్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఏ గడపవద్ద అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి సంక్షేమ పాలనపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పటానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పథకాలు అన్నీ అందుతున్నాయని, రాజకీయాలు చూడటం లేదని ప్రజలు సంతోషంగా చెబుతున్నార న్నారు. ఒక్కొక్క ఇంటికి రూ. లక్ష నుంచి రూ. 1. 50 లక్షల వరకూ లబ్ది చేకూరిందన్నారు. అబద్దాన్ని పదే పదే చెబితే నిజం అయిపోదని, చంద్రబాబు, పవన్ బుద్ధి తెచ్చుకుని మసులుకోవాలని సూచించారు. ముదునూరు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులనువివరించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు కేటా యించిన నిధుల వివరాలను వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa