ఇద్దరు భార్యలు సరిపోక బాలిక మెడలో మూడు ముళ్లు వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అనంతపురం హనుమాన్ నగర్‌కు చెందిన రమణకు ఇద్దరు భార్యలు. అయితే ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, మే 25న ధర్మవరంలో ఆమెకు తాళి కట్టాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని పోలీసులు గురువారం రిమాండ్‌కు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa