దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని అయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. శుక్రవారం ఉదయం సిపిఐ రాష్ట్ర ప్రథినిది బృందం మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, దోనేపూడి శంకర్, డి. హెచ్.పి.ఎస్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవాది సుబ్బారావు, రాయప్ప తో కూడిన పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి వినతిపత్రంఅందజేరేసింది.
పలు అంశాలను రామకృష్ణ ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రములో పదే పదే దళిత, మహిళలపై దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుతున్న ప్రభుత్వానికి చలనం లేదని అన్నారు. గతంలో బీహార్ మాదిరిగా నేడు రాష్ట్రములో శాంతి భద్రతలు క్షిణించాయని తెలిపారు. లేకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను హత్య చేసి తన కారులోనే తీసుకువచ్చాడంటే జగన్ ప్రభుత్వం ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు అన్నారు. డాక్టర్ సుధాకర్ మొదలుకొని సుబ్రహ్మణ్యం వరకు దళితల పై ఇన్ని అరాచకాలు జరుగుతున్న ఒక్కసారి కూడా జగన్ నోరు విప్పలేదనివిమర్చించారు. కాకినాడ పోలీస్ లపై నమ్మకం లేదని ఈ ఘటన పై సిబిఐ విచారణ చేయాలనీ కోరారు, త్వరలో దళితుల సమస్యలపై రాష్ట్ర వర్క్ షాప్ నిర్వహిస్తామని రామకృష్ణ అన్నారు.