ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు కుంటోందని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరులోని శ్రీ జగదాంబ సమేత సోమేశ్వరస్వామి దేవస్థానం (శివాలయం) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార ఘనంగా జరిగింది.
ఎమ్మెల్యే పార్థసారథి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆలయ కమిటీ చైర్మన్గా చిందా వీరవెంకట కుటుంబరాజు, కమిటీ సభ్యులుగా మరీదు అర్జునుడు, గోన కృష్ణకుమారి, బి. ఇందిరా భవాని, బి. నాగలక్ష్మి, పారుపూడి కృష్ణకుచేలుడు, వి. జనార్దన్రావు, సి. రాంబాబులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈఓ కానూరి సురేష్ బాబు నూతన పాలకవర్గానికి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ భక్తిభావంతో సేవలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి పాటు పడాలని నూతన కమిటీకి సూచించారు. మునిసిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.