మునగ నూనెలో ఎన్నో పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉండడంతో ఈ ఆయిల్ వాడితే మచ్చలు మటుమాయం అవుతాయి. మాయిశ్చరైజర్‌గా దీనిని వాడొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి ఈ ఆయిల్ మేలు చేస్తుంది. పొలుసులుగా మారిన చర్మాన్ని నయం చేస్తుంది. తలకు రాసుకుంటే చుండ్రు పోయి, జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారతాయి.