మహారాష్ట్రలోని భందారా జిల్లాలో ఓ కోడి పుంజు మద్యానికి బానిసగా మారింది. పిప్రీకి చెందిన భావు కాతోరే అనే వ్యక్తి ఈ కోడిపుంజును పెంచుతున్నాడు. కొన్ని నెలలుగా ఆ కోడి మద్యం తాగిన తర్వాతే ఆహారం తింటుంది. మందు లేకపోతే అది ఆహారం తీసుకోదు. కోడిపుంజు గతేడాది అనారోగ్యానికి గురైందని, ఓ వ్యక్తి సలహా మేరకు దానికి మద్యం తాగిస్తే బానిసగా మారిందని భావు కాతోరే చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa