స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లో ఏర్పాటైన స్టేర్ లైట్ కంపెనీకి ఏడాదికాలం గా రు. 20కోట్ల బకాయి ఇవ్వకపోవడం వలన ఆపరేషన్ నిర్వహణ చేయలేమని వదిలివేయడంతో నగరంలో ఏర్పాటైన ట్రాఫిక్ సిగ్నల్స్ సి సి కెమెరాలు నిర్వహణ నిలిచిపోయిందని పౌర సంక్షేమ సంఘం పేర్కొం ది. నిర్వాహణ సంస్థ లకు బకాయిలు సక్రమంగా చెల్లించ కుంటే కొత్త టెండర్లు పిలిచినా వేరెవరు మాత్రం ముందుకు వస్తారని ప్రశ్నించారు.
నగరం లో 500సి సి కెమేరాలు వుండగా మరో 800కెమెరాల అవసరం వుందన్నారు. గంజాయి మాదక ద్రవ్యాలు సేవించే సరఫరా చేసే కార్యకలాపం యధా లాపంగా ప్రతిచోటా జరిగిపోతోందన్నారు. యువత పెడదారినపడుతున్నదుస్తితిఎక్కువయ్యిందన్నారు. బ్రిడ్జిలదిగువ. స్మశానప్రాంగణాలు. పాఠశాలల మైదానాలు. బీచ్ రోడ్డు ఏరియాలు. పోర్టుప్రాంతా లు. జన సంచారం తక్కువ కలిగిన ప్రదేశాల్లో. అసాంఘిక శక్తుల బెడద ఎక్కువయ్యిందన్నారు.
సి సి కెమెరాల ఏర్పాటు పర్యవేక్షణ లేకపోవడం వలన పరిస్తితి పూర్తిగా అదుపు తప్పిందన్నారు. సి సి కెమెరాల నిఘా లేకుండా పోలీస్ డ్యూటీ లతో నియంత్రణ సాధ్యం కాదన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా బకాయి ఇవ్వక పోవడం పర్యవేక్షణ సంస్థ బాధ్యతలు వదిలి పెట్టి వెళ్లిపోవడం యాదృచ్చికంగా జరిగిన ఘటన కాదన్నారు. నగరంలో గంజాయి అమ్మకం వాడకం తీవ్రంగా వుందన్నారు. గంజాయి సిగరెట్లు త్రాగుతున్న ధోరణి ప్రబలిందన్నారు.
బొంబాయి సిగరెట్లు గా లక్షల్లో రోజువారీ అమ్మకాల సరఫరా జరగడం వలననే నేటి తరం వీటి బారిన గుట్టు చప్పుడు కాకుండా బానిసలవుతున్న వ్యసనం దాపురిస్తోంద న్నారు. మద్యం షాపుల వద్ద బహిరంగంగా మద్యం సేవించడం ప్రతి చోట నిత్యకృత్యం గా వుందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ లేక పోవడం వలన ట్రాఫిక్ అవస్థలుఅధికం కాగారాత్రి పగలు తేడా లేకుండా గంజాయి వంటి మాదక ద్రవ్యాల సేవన వ్యసనం కాకినాడ జిల్లా కేంద్రం లో ఎక్కువయ్యింద న్నారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కంపెనీ బాద్యులతో సి సి కెమెరాల పర్యవేక్షణ కేంద్రం పూర్తి స్థాయిలో పని చేసే ఏర్పాటు చేస్తే పెరుగుతున్న అసాంఘిక బెడద తగ్గుతుందన్నారు. టెండర్లు పిలిచాం ఎవరూ రావడం లేదన్న కుంటి సాకులు చెప్పి పబ్బం గడపడం నగర ప్రగతికి మంచిది కాదన్నారు. పాత సంస్థకు బకాయిలు క్లియర్ చేస్తే వారే వచ్చి చేయగలుగుతారని లేకుంటే కొత్త సంస్థలు నమ్మకంగా పని చేయడానికి మరింత ముందుకి రాగలుగుతా యని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కౌన్సిల్ చర్చ చేయక పోవడం శోచనీయమ న్నారు. జిల్లా కలెక్టర్ స్మార్ట్ సిటీ కంపెనీ కార్యాలయాన్ని సందర్శించి పునరుద్దరణ పనులు అదనపు కెమెరాల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa