ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. గంగోత్రి-యమునోత్రి నేషనల్ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యాత్రికులను మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa