కర్నాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా మాడ్రళ్లిలో వివాహేతర సంబంధానికి ఓ వ్యక్తి బలయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని మానేయాలని సిద్ధశెట్టి (47)కి శివణ్ణ (59) పలుమార్లు సూచించాడు. ఆదివారం కూడా వెళ్లి మరోమారు హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో, పట్టరాని ఆగ్రహంతో కత్తితో సిద్ధశెట్టిని పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సిద్ధశెట్టి సోమవారం మరణించాడు. పరారీలో ఉన్న శివణ్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.