ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నగరంలో రోజూ 200 కోవిడ్ కేసులు వెలుగు చూస్తాయి. దీంతో ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఉత్తర్వులు తాజాగా అమలు చేసింది.