ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగటం ద్వారా ప్రేగుల్లో నిల్వ చేయబడిన ధూళి శుద్ది అవుతుంది. ఆకలి వేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావు. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి, జీర్ణ సమస్యలు తొలగుతాయి. శరీరంలో రక్త ప్రసరణ బాగా సాగుతుంది. గొంతు సమస్యలు పోతాయి. దగ్గు, పడిశంతో బాధపడుతున్నవారికి వేడి నీరు చాలా మంచి మందు అని చెప్పాలి. వైరస్‌లు ప్రమాదకర బ్యాక్టరీయాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంది.