ఆత్మకూరు పట్టణంలోని చికెన్ సెంటర్ లలో మంగళవారం పశుసంవర్ణక శాఖ ఏడి డాక్టర్ భవానీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు నాణ్యమైన చికెన్, గుడ్లు విక్రయించాలని సూచించారు. అదేవిధంగా రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచిన మాంసం, గుడ్లు విక్రయిస్తే రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.