స్పందన లో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగతిన పరిష్కరించాలని కలెక్టరు బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులతో 212 అర్జీలను స్వీకరించారు. బాధితులు చెప్పిన సమస్యలను కలెక్టరు సావధానంగా విని సంబంధిత అధికారులకు తక్షణం పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీ గంగాధర్ గౌడ్ ఆర్డిఓ భాగ్యరేఖ పాల్గొన్నారు.