కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆర్, ఆర్ రవి ఇంటిపై దాడిని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. రవితో చంద్రబాబు ఫోనులో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా నిలుస్తుందని, దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రశాంతమైన కుప్పంలో ఇలాంటి దాడులు జరగడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.