--- ఇప్పుడంటే చెస్ బోర్డులొచ్చాయి కానీ, 1924 కాలంలో ప్రజలే పావులుగా మారి నిజమైన చెస్ ను ఆడేవారట. దీనికి హ్యూమన్ చెస్ అని పేరు.
--- బంగాళాదుంపలతో చిప్స్ ఎవరు, ఎప్పుడు, ఎందుకు తయారు చేసారో తెలుసా? తన హోటల్ కొచ్చిన ఒక కస్టమర్ అదే పనిగా వేయించిన సన్నటి బంగాళదుంపలను అడుగుతుండటంతో విసుగెత్తిన వంటమేస్త్రి బంగాళదుంపలను చిప్స్ లా తయారుచేసాడట.
--- మీకు పదిహేనేళ్ల వయసున్నప్పుడు భూమిని వదిలిపెట్టి స్పేస్ షిప్ లో అంతరిక్షానికి చేరి ఒక ఐదు సంవత్సరాలు గడిపారని అనుకోండి. ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి భూమ్మీద కాలు పెట్టారు. అప్పుడు మీ వయసు ఎంతుంటుందనుకుంటున్నారు? 15+5 =20ఏళ్ళు. కానీ మీ స్నేహితులకు 65 ఏళ్ళు వచ్చేస్తాయి. ఈ ఫినామినానే ఫిజిక్స్ లో టైం డైలేషన్ అని అంటారు.