అంగన్ వాడి కేంద్రాలలో ప్రతి బుధవారం ఇమ్యునైజేషన్ విధిగా జరగాలని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ తెలిపారు. జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ స్త్రీశిశు సంక్షేమ శాఖ పీడీ నాగ శైలజ, సిడిపిఓ లతో సమీక్షసమా వేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ ఆశయం కోసం అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసిందో అందుకు నిర్దేశించిన విధి విధానాలను క్షేత్ర స్థాయిలో చేయాలన్నారు.