శ్రీశైల జలాశయానికి 4, 311 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నీటి లెక్కలు కొలిచే సమయానికి జలాశయానికి సుంకేసుల నుంచి 4, 311 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 215. 807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39. 6122టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. అదేవిధంగా గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గానూ 818. 30అడుగుల నీటిమట్టం నమోదైనట్టు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు. కాగా శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు ఎలాంటి నీటి విడుదల జరగడం లేదు. అదే విధంగా కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం లేదని అధికారులు తెలిపారు.