ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన సేంద్రియ ఎరువులను సృష్టించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 01:38 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో నాణ్యమైన సేంద్రియ ఎరువులను సృష్టించాలని నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పాములపాడు మండలంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు అని ఆయన పరిశీలించారు. అదేవిధంగా అక్కడ తయారుచేసిన సేంద్రియ ఎరువులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెత్త నుంచి ఎరువులను తయారు చేసి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఎల్పీవో కవిత, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa