రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన పదో తరగతి తప్పుడు ఫలితాలకు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్నారని వారి మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక పొట్టి శ్రీరాములు కూడలిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినిలకు ఆత్మశాంతి కోసం ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి. రమేష్ గుంతకల్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పవన్ కుమార్, వెంకీ మాట్లాడుతూ పదో తరగతి తప్పుడు పరీక్షాఫలితాలతో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మరణానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల న్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 లక్షల మంది విద్యార్థులు మాత్రమే పాస్ కావడంరెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం అనుమానాలకు తావిస్తోంద న్నారు. విద్యార్థులకు పరీక్ష ఫీజు లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు, రివల్యూషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధప్ప, మారుతి, నరేంద్ర, వంశీ, లక్ష్మి, సరోజ, తదితరులు పాల్గొన్నారు.