కర్ణాటకలోని మైసూర్ జిల్లా పెరియపట్న తాలుకా కగ్గుండిలో ఒక్కళిగ సామాజిక తరగతికి చెందిన ఓ బాలిక (17) పక్క గ్రామంలోని దళిత యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఇటీవల ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించడంపై వారు ఆగ్రహించారు. ఆ యువకుడికి దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించారు. అయితే ఆ బాలిక తన ప్రియుడితో ప్రేమను కొనసాగించింది. ఇది సహించలేని తండ్రి తన కుమార్తెను గొంతు కోసి హత్య చేశాడు. తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు బుధవారం మైసూరు ఎస్పీ చేతన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa