పొరుగు దేశం పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్, కరెంట్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ తరుణంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ సారథ్యంలో కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శనివారం దేశంలో సెలవు దినంగా ప్రకటించాలని, శుక్రవారం వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రజలు ఇంటి వద్ద ఉండడంతో ఇంధన కొరత సమస్య కొంత తీరుతుందని అక్కడి పాలకులు అభిప్రాయపడుతున్నారు.