ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్న ఆర్‌బీఐ అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 214 పాయింట్లు నష్టపోయి 54,892 వద్ద ముగిసింది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 16,356 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
టాటా స్టీల్ (1.70%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.66%), డాక్టర్ రెడ్డీస్ (1.52%), బజాజ్ ఫైనాన్స్ (1.25%) మరియు టీసీఎస్ (1.22%).
టాప్ లూజర్స్:
భారతీ ఎయిర్‌టెల్ (-3.31%), ఐటీసీ (-2.03%), రిలయన్స్ (-1.74%), ఏషియన్ పెయింట్స్ (-1.44%), యాక్సిస్ బ్యాంక్ (-1.03%).