కాకినాడ నగరంలోని విక్టోరియా వాటర్ వర్క్ పరిధిలో త్రాగునీటి పైప్లెన్ మరమ్మతుల నేపథ్యంలో పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నీటి సరఫరా శాఖ ఎస్ఈ సత్య కుమారి తెలిపారు. ఈ మేరకు కాకినాడ నగరంలోని 38 , 41 నుంచి 50 డివిజన్లకు ఒక పూట నీటి సరఫరా ఉండదన్నారు. కావున ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు