మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో అంతర్ సింగ్ అనే యువకుడితో షైన బీ (23) కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. గర్భం దాల్చిన ఆమె ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తండ్రిగా ఉండలేనంటూ ప్రియుడు షాకిచ్చాడు. మధ్యవర్తుల సాయంతో లీనా అనే మహిళకు బిడ్డను ఇటీవల రూ.5.5 లక్షలకు విక్రయించింది. ఆ డబ్బుతో ప్రియుడితో కలిసి షాపింగ్ చేసింది. పోలీసులకు విషయం తెలియడంతో నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.