నక్కపల్లి మండలం ఉద్దండపురం హైవే జంక్షన్ వద్ద బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఏ పి ఎస్ ఆర్ టి సి ఇంద్ర బస్సు బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నక్కపల్లి మండలం ఉద్దండపురం హైవే జంక్షన్ కు వచ్చే సరికి ప్రమాదానికి గురయింది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి వెళుతున్న బస్సు ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ కు రెండు కాళ్ళు విరిగి పోవడంతో క్యాబిన్ లో చిక్కుకుపోయాడు. స్థానికులు అతన్ని బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ సమయంలో ఉద్దండపురం హైవే జంక్షన్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.