కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు అధిక ధరలకు వ్యతిరేకంగా జరుగుతున్న జనం కోసం సిపిఎం పార్టీ కార్యక్రమంలో భాగంగా కొమరాడ మండలం కేంద్రంలో నాయకులు సాంబమూర్తి ప్రచారం చేపట్టారు. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచారని, అటు రైతులకు గాని ఇటు కార్మికులకు గాని వ్యవసాయ కూలీలకు ఎవరికీ భరోసా లేని పరిస్థితి ఈరోజు ఉందని కనుక ప్రతి ఇంటికెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని నాయకులు తెలిపారు.