కురుపాం మండలంలోని కోలిశ గ్రామంలోని కడ్రక బోడమ్మ అనే గిరిజన వృద్ధురాలికి చెందిన రేకిల్లు రాత్రి వీచిన ఈదురు గాలులకు నేలకూలింది. వేసవి కాలం కావడంతో ఆమెతోపాటు కుమారుడు, మనవరాలు ఇంటి బయట నిద్రిస్తుండటంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఎంపీటీసీ ఊలక కృష్ణవేణి, వీఆర్వో తిరుపతిరావు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని వృద్ధురాలు కోరుతున్నారు.