ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఇళ్లల్లోనే ఉండాలి. 3 అంతకంటే ఎక్కువ టైర్లు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండాలి. పొలాల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఉండాలి. చెట్ల కింద ఉండొద్దు. ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసీ ఆఫ్ చేయాలి. నీళ్లలో ఉండొద్దు. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడొద్దు. గుంపులుగా కాకుండా దూరంగా ఉండాలి. స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి చేయొద్దు.