మామిడి పండ్లు రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణిల్లో మలబద్ధకం సమస్యకు మామిడి పండు ఔషధంలా పనిచేస్తుంది. రుతుక్రమం సవ్యంగా రావడంలో మామిడి సహాయపడుతుంది. జననాంగాలకు మామిడి మేలు చేస్తుంది. రోజుకో పండు తింటే మీ చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, రోగనిరోధక శక్తినిపెంచుతుంది.