సీఎం జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, పోలీస్ లకి లొంగిపోయిన వ్యక్తి గంగాధర్ రెడ్డి , కానీ ఇతను నిన్న హఠాత్తుగా మరణించడం జరిగింది. ఏది హత్య అని చూస్తేనే అర్థం అవుతుంది . సాక్షాలు చెప్పడం వలన కేసు వెనక ఉన్న వారి పేర్లు బయటకి వస్తాయి అనే నెపంతో ఇతనిని హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ... పరిటాల హత్యమాదిరిగానే వివేకా హత్య కేసు నిందితులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. జగనాసుర రక్తచరిత్ర- 2 ప్రారంభమైంది. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి.బాబాయ్ హత్యకేసులో అనుమానితులైన ముగ్గురు మరణం వెనుక మిస్టరీ ఛేదించాలి. వివేకా హత్యకేసులో మిగిలిన నిందితులు, అప్రూవర్ల ప్రాణాలకు సీబీఐ రక్షణ కల్పించాలి.