హర్యానాలోని నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్ జంతువుల కోసం 'అనొకోవ్యాక్స్' పేరుతో కరోనా టీకాను తయారు చేసింది. ఈ టీకాను గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆవిష్కరించారు. ఈ వ్యాక్సిన్ జంతువుల్లో డెల్టాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ ను నిర్వీర్యం చేస్తుందని తయారీ సంస్థ తెలిపింది. ఇది కుక్కలు, సింహాలు, పులులు, ఎలుకలు, కుందేళ్లలో బాగా పనిచేస్తుందని తెలిపింది.