కరోనా వైరస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కరోనా ఎక్కడ పుట్టిందో తేల్చేందుకు మరింత రీసెర్చ్ అవసరమని డబ్ల్యూహెచ్వో నిపుణుల బృందం పేర్కొంది. ఇప్పటివరకు తమ వద్ద కరోనా పుట్టుకకు సంబంధించి స్పష్టమైన వివరాలేవీ లేవని తేల్చిచెప్పింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు వ్యాపించిందన్న అంశంపై విస్తృత పరిశోధన చేయాలని చెప్పింది.